వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా.. ఫిట్‌గా తయారవుతున్న హీరోయిన్ల ఫిట్నెస్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దామా…!
1. సమంత : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కిరీటాన్ని గెలుచుకున్న సమంత ఎప్పుడూ ఫిట్నెస్ కోసం యోగా జిమ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో మనతో పంచు కొంటూనే ఉంటారు

2. శిల్పాశెట్టి : పదహారేళ్ల పిల్లలా శరీరాన్ని విల్లులా వంచుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండే శిల్పాశెట్టి అసలు వయసు ఎంతో తెలుసా 46 సంవత్సరాలు. ఇప్పుడు బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న శిల్పాశెట్టి తన శరీరాకృతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తోంది. ఎంత బిజీగా ఉన్నా.. వారానికి కనీసం మూడు రోజులైనా గంటపాటు యోగాకు సమయం కేటాయిస్తానంటోంది. సూర్య నమస్కారం చేయడం తనకెంతో ఇష్టమట.

3. అనుష్క: నటి కాకముందే యోగా గురువు అయినటువంటి అనుష్క శెట్టి తన శరీరాకృతిని యోగాతో మారుస్తూ ఉంటుంది

3. జాక్వలైన్ ఫెర్నాండెజ్ : రెబల్ స్టార్ ప్రభాస్ సాహో లో ఒక స్పెషల్ సాంగ్ తో తెలుగు తెరకు పరిచయమైన జాక్వలైన్ ఫెర్నాండేజ్ అద్భుతంగా శరీరాన్ని వంచుతూ యోగాసనాలు చేస్తుంది. ఆ ఆసనాలు చూస్తే అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా అనే సందేహం రాకమానదు. కొన్నేళ్లుగా యోగా తన జీవితంలో అంతర్భాగమైందంటున్నారు ఈ భామ. మన శరీరాన్ని, మనస్సును నియంత్రణలో పెట్టేది యోగానే అని అంటోందామె.

4. రకుల్‌ప్రీత్‌సింగ్ : ఫిట్నెస్ అనగానే తెలుగు హీరోయిన్లు మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు రకుల్ ప్రీత్, ఫిట్నెస్ సెంటర్ ని బిజినెస్ స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ ప్రతిరోజు జిమ్ తో పాటు యోగా చేయనిది తన రోజు యాక్టివిటీ ని ప్రారంభించదు. యోగా వల్లే తాను కరోనా నుంచి వేగంగా కోలుకోగలిగానని ఆమె చెప్తోంది.

5. ఇలియానా డి క్రూజ్ : కిక్ చిత్రంలో యోగ యోగాసనాలతో అందరినీ మైమరిపించిన ఇలియానా ప్రతి రోజు యోగా చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంది.

6. కాజల్ అగర్వాల్ : ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ ఆకృతిని మరియు ఫిట్నెస్ కోసం ప్రతిరోజు మరియు యోగా చేస్తూ ఉంటారు. తన యోగ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పంచుకున్నారు కూడా.

7.శ్రియాసరన్‌కు అధోముఖాసనంతోనే రోజు ప్రారంభమవుతుందట. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యోగా తరగతులు కూడా చెబుతుంది.

8.శ్రద్ధాదాస్: ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ అలరిస్తున్న శ్రద్ధాదాస్ మాత్రం తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఏమాత్రం తగ్గించలేదు. నిత్యం యోగా చేస్తూ.. తోటి హీరోయిన్లు అసూయపడే లా మెయింటైన్ చేస్తోందామె.

10.రాశికన్నా: ఎన్నో యోగా జిమ్ కి అందించిన ఎన్నో ఎన్నో చిత్రాల్లో ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో అనునిత్యం షేర్ చేస్తూనే ఉన్నాయి


