జంతువులు – విశ్వాసం గల జంతువులు

పూర్వం విద్యార్థులు పర్ణశాలలో, ఆశ్రమాలలో విద్యార్జన చేసేవారు. ఆ రోజులలో క్రూర మృగాలు విరివిగా ఉండేవి. గురువులు, శిష్యులను తోడ్కొని అరణ్యాలలోకి వెళ్లి జంతువులు వాటి అలవాట్లు గురించి తెలియజేసేవారు. ఒక్కొసారి అందరిని ఎత్తయిన వృక్షాలను ఎక్కమనెవారు తర్వాత చూస్తే అటువైపు పులులు, సింహాలు గుంపుగా వెళుతూ ఉండేవి.

ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కొండ రాళ్ల వెనక దాగమనేవారు తర్వాత చూస్తే ఏనుగుల గుంపు నదీ తీరానికి వెళుతూ ఉండేవి. ఒక్కోసారి చెకుముకి రాళ్లతో ఎండు గడ్డిని, ఎండు పుల్లలని కాల్చమనేవారు తర్వాత చూస్తే భళ్లుకాల గుంపు పారిపొతు ఉండేవి. ఒక్కోసారి భూమిపై గట్టిగా అడుగులు వేస్తూ నడవమనెవారు. ఈ భూతరంగాలకు పాములు లాంటి ప్రాణులు తప్పుకునేవి. తర్వాత గురువులను ఈ విషయ పరిజ్ఞానం గురించి శిష్యులు ప్రశ్నించగా అప్పటి గురువుల సమాధానం ఈనాటికి అందరికి ఆమొదయెగ్యం. అదిఎమిటి అంటె ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహార, వ్యవహార, నియమ, నిబందనలు ఉన్నాయి. అవి లేని ప్రాణి ఒక్కటే అదే మనిషి.

ప్రపంచంలో మనుగడలో ఉన్న జంతు జాతిలో కొన్ని అత్యంత విశ్వాస కర జంతువులు గుర్రం, ఆవు, ఏనుగు, సగటు మానవుడు ఆలోచించినట్లు కుక్క మాత్రమే కాదు.

గుర్రము:
గుర్రపు విశ్వాసానికి కొన్ని సజీవ ఉదాహరణలు ఉన్నాయి. రాణాప్రతాప్ సింగ్ యుద్ధంలో క్షతగాత్రుడై అలసిన వేళ తన అత్యంత ప్రీతిపాత్రమైన గుర్రము చేతక్, ప్రభువు పరిస్థితిని గమనించి వాయువెగంతో దౌడు తీసి శత్రు రాజులకి చిక్కకుండా యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉన్న దట్టమైన అరణ్యానికి మోసుకువెళ్ళింది. మార్గ మద్యలొ అడ్డుగా వచ్చిన పెద్ద కందకాన్ని దుమికి తన రాజు ప్రాణాలు రక్షించుకుంది. ఈ ప్రయత్నంలో గుర్రం తన కాలు విరిగిన లెక్కచెయక వాయువెగంతో దౌడు తీసి, నునుపైన పచ్చిక ప్రాంతాన్ని ఎంచుకొని మెత్తగా ఉన్న ప్రదేశంలో పడవేసింది. చుట్టుప్రక్కల ఉన్న ఔషధ గుణం కల మొక్కలను నమిలి ఆ రసాన్ని రాజు గాయంపై పూతగా మరియు పేడను లేపనంగా రాసి మూర్ఛ నుండి తేరుకున్న రాజుకు చెట్ల నుండి ఫలాలను తటాకాల నుండి నీటిని సమకూర్చి పూర్తి ఆరోగ్యవంతుడిని చేసింది.

ఏనుగు:
మహారాణా ప్రతాప్‌ పెంపుడు ఏనుగు పేరు రాంప్రసాద్‌. యుద్ధంలో రాంప్రసాద్, మొఘలులకు చెందిన 13 ఏనుగులని హతమార్చింది. అక్బర్ సైన్యం రాంప్రసాద్‌ను బంధించడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు చక్రవ్యూహం పన్నారని అల్ బరౌని తన రచనలో పేర్కొన్నాడు. బంధించిన రాంప్రసాద్‌ను అక్బర్ ముందు నిలబెడితే దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు. అయితే ఆ ఏనుగు 18 రోజుల వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ప్రాణాలు కోల్పోయింది.

ఆవు:
ఆవు ఎంతో పవిత్రమయిన జంతువు, సమస్త మానవాళికి ఎంతో ఉపయోగకరమైన, పూజింపదగిన ప్రాణి. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. కుటుంబ సభ్యులు తనను స్పర్శించి నపుడు వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకొగలుగుతుంది. దానికి తగిన ఔషధ గుణం గల గ్రాసం తిని పాల రూపంలో పరివార సభ్యులకు అందిస్తోంది.

కుక్క:
విశ్వాసం గల జంతువులలో కుక్క ఒకటి, ఈ విషయం సర్వ విధితమే. చత్రపతి శివాజీ మహారాజ్ మరణించినప్పుడు అతని పెంపుడు కుక్క ఛితిలొ దూకి ప్రాణాలు అర్పిస్తుంది.

సూచన :
జి. ఆర్. కె. మూర్తి