విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు తన 72వ పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా నటించడం విశేషం. చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాత్ర పేరు ఆర్. రామన్న చౌదరి. ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చరణ్ రోరి నిర్మిస్తున్నారు.
ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ఇటీవలే విడుదల చేశారు.