కాలినడకన తిరుమలకు అఖిల్‌

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌ సోమవారం తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఆయన నటించిన తొలిసినిమా ‘అఖిల్‌’ ఈ నెల 11 విడుదలవుతోంది. ఆ సినిమా విజయవంతం కావాలని కోరుతూ అలిపిరి పాదాలమండపం వద్ద తొలుత పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను నెత్తిన పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. కాగా, భారీ వర్షం కారణంగా 3 గంటలు ఆలస్యంగా వచ్చిన అఖిల్‌కు.. అక్కినేని అభిమానులు ఘన స్వాగతం పలికారు.