ఏపీ సీఎం జగన్ మీద పెద్ద కుట్ర జరుగుతుంది – హీరో రామ్

 ‘హోటల్ స్వర్ణ ప్యాలెస్ ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వం అక్కడే క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు’ అని  హీరో ప్రశ్నించారు.  ఇక మరో ట్వీట్ లో ఫైర్ + ఫీజు = ఫూల్స్ అంటూ అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజుల వైపు మళ్లిస్తున్నారు’ అంటూ రమేశ్ ఆసుపత్రిపై విమర్శిస్తున్న వారికి కౌంటర్ గా హీరో రామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక మేనేజ్ మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని ట్విట్టర్ లో ఆ బిల్స్ ను హీరో రామ్ పోస్ట్ చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది సీఎం జగన్ గారు . మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్‌కు‌.. మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం అంటూ #APisWatching పేరిట ప‌లు ట్వీట్స్ చేశారు