ఏకలవ్యుడు –బొటన వేలు

మహాభారత కాలంలోని ఆచార్యులు ద్రోణుడు తాను కొలువు చేస్తున్న కౌరవ సామ్రాజ్య విధేయుడు.

మహాభారత కాలంలోని ఆచార్యులు ద్రోణుడు తాను కొలువు చేస్తున్న కౌరవ సామ్రాజ్య విధేయుడు. విద్యార్జన కొరకు వచ్చిన ఏకలవ్యునికి సాంప్రదాయ ప్రకారం తాను విద్య నేర్పకూడదు, తాను కౌరవ పాండవులకు మాత్రమే నిర్దేశించబడిన వారు కనుక తన అసహాయతను వ్యక్తం చేసి ఏకలవ్యుని అభ్యర్థనను తిరస్కరించను. కానీ ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్ళి తన దీక్ష, పట్టుదల, ఏకాగ్రతతో తన నిషాధ రాజ్యంలో, బంకమట్టితో ద్రోణాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ట జరుపుకొని, ఆ ప్రతిమనే తన గురువుగా భావించి విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు, ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు.

విలువిద్య
ఒక సారి విలువిద్య సాధన కొరకు అర్జునుడు, ద్రోణుడు, ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క, ధనురాభ్యాసం కావించుచున్న ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. విచిత్ర వేషదారణతో కనిపించిన ఏకలవ్యుని చూసి కుక్క పదే పదే మొరగనారంభించింది. “నన్ను చూసి అరుస్తావా” అనుకున్న ఏకలవ్యుడు ఆవేశానికి లోనై, కుక్క నోరు తెరచి మూయుటకు మద్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు కొట్టాడు. ఆ దారి వైపుగా వస్తున్న పాండవ రాకుమారులకు ఈ అద్భుత దృశ్యం కంటపడింది. ఇంతటి ప్రతిభా పాటవాలు కలిగిన వారు ఈ అరణ్యంలో ఎవరా? అని వారు ఆశ్చర్యపోయారు. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుకొని, ‘అర్జునుడు’ రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నా కన్న బాగా విలువిద్య చేసే వారు ఉన్నారని తెలిపారు.

గురుదక్షిణ
ఏకలవ్యుడు గురించి తెలుసుకున్న ద్రోణాచార్యుల వారు, కలవడానికి ఏకలవ్యుని వద్దకు వెళ్లారు. గురువును చూడగానే ఏకలవ్యుడు అత్యంత భక్తి ప్రపత్తులతో తన గురువు గారికి ఘణంగా స్వాగతం తెలిపారు. ఏకలవ్యుడు విలువిద్య చూసి ఏంతో సంతోషించారు. కాని ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తెడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే ఆవేశపరుని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు క్షేమం కాదని, ప్రమాదమని తలచి, రాబోవు ప్రమాదాలను ముందే గ్రహించి, నివారించుటకు గురుదక్షిణగా భవిష్యత్తులో ఎటువంటి యుద్ధంలో విలువిద్య ప్రదర్శన చేయకూడదు అని ఏకలవ్యుని, ద్రోణాచార్యుల వారు ఆజ్ఞాపించారు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన బ్రొటని వేలు కలిగి ఉంటే భవిష్యత్తులో ఏదైనా సందర్భంలో ఆవేశానికి లోనై యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉన్నందువలన తన కుడి చేతి బొటన వేలుని తానే స్వయంగా కోసి గురుదక్షిణగా సమర్పించాడు.

NOTE: గమనించదగ్గ విషయం ద్రోణుని గురుస్థానం, ఏకలవ్యుని దీక్ష, పట్టుదల, ఏకాగ్రత, మాట నిలకడ, గురుభక్తి.

సూచన :
జి.ఆర్. కె. మూర్తి