అన్‌లాక్-4 అమల్లో భాగంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఈ-పాస్‌తో పని లేకుండానే రాష్ట్రంలోకి రావచ్చు. ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కరోనాకు పూర్వ పరిస్థితి అమలవుతోంది. దీనిలో భాగంగా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నారు.