ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీ ఆఫర్ చేస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ వంటివి ఉన్నాయి.
‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’లో భాగంగా వన్‌ప్ల్‌స్ 6టి-8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధరను రూ.41,999 నుంచి రూ.27,999కి తగ్గించింది. 8జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ ధరను రూ.45,999 నుంచి రూ.31,999కి తగ్గించింది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.10,150 అదనపు రాయితీ లభిస్తుంది.