Categories
Health Tips

నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు

సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ ముఖ్యంగా వేసవి సీజన్ లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుత ప్రయోజనాలు

రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.

బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది
ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.

కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.

డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.

మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు .

– అందరికీ భాగస్వామ్యం చేయండి
రోజూ ఉదయం ”కాఫీ, టీ”ల కంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో అద్భుత మార్పులు

సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు.
మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు. కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు.
పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.

బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది
ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.

కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.

డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.

మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు .

Categories
Health Tips

దానిమ్మ పండు చేసే లాభాలు

ఎరుపు రంగులో నిగ నిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే ‘దానిమ్మ’ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పొడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే దానిమ్మ మన దగ్గర ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

2. దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.

3. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.

4. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

5. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధ పడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి, దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

6. రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది.

7. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది. వాపును అరికడుతుంది. దానిమ్మ ఆకుల నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.

Categories
Health Tips

తెల్లగలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యలని తగ్గిచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి

తెల్లగలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యలని తగ్గిచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి

తెలంగాణాలో 3 నెలలు ఇంటి అద్దె అడగొద్దు… సీఎం కేసీఆర్ !

కిడ్నీ పాడైనప్పుడు విష్యతుల్యమైన సీరం క్రియేటినిస్, యూరియా వంటి మలినాలు మూత్ర్రంతో వెళ్లిపోకుండా రక్తంలోనే కలిసిపోతాయి , ఆలా జరిగితే మనకి త్వరగా ఆయాసంతో పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టదు , కొన్నాళ్ళకి రక్తం పూర్తిగా చెడిపోయే ఆవకాశం కూడా ఉంది, ఇంకా కిడ్నీలపై దాదాపు పది లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి, ఇవి రక్తాన్ని జల్లెడలాగా ఫిల్టర్ చేస్తాయి, కిడ్నీ పాడైనప్పుడు ఇవి రక్తాన్ని శుద్ధి చేయలేవు, మలినాలని రక్తం నుండి వేరు చేయలేవు, అలాగే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడినప్పుడు కూడా కిడ్నీలు పాడైయ్యే అవకాశం ఉంది, అలా జరిగితే మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

పూర్వకాలంలో పునర్నవ(తెల్ల గలిజేరు ) ఆకుకూరని ఎక్కువగా వాడేవారు, తెల్లగలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యలని తగ్గిచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి, అందుకే ఈ ఆకుకూరని ఆయుర్వేదం వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు , ఈ తెల్ల గలిజేరు ఆకుకూరని తరుచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

Categories
Health Tips

పాలలో పంచదారకు బదులుగా బెల్లం కలిపి తాగితే ??

పాలలో పంచదారకు బదులుగా బెల్లం కలిపి తాగితే ??

పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. బెల్లానికి అనీమియా ఎదుర్కోనే శక్తి పుష్కలంగా వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పిని పాలద్రోలడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.

Categories
Health Tips

30 నిమిషాలు ఈత కొట్టడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నొ

30 నిమిషాలు ఈత కొట్టడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నొ

ఈత కొట్టడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును ..స్విమ్మింగ్ చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. సగటున ముప్ఫై నిమిషాల పాటు ఈతకొడితే సుమారు మూడొందల కెలోరీలు కరుగుతాయి. వారంలో కనీసం నాలుగు రోజులు ఈత కొట్టడానికి కొంత సమయం కేటాయించండి. ఇలా చేస్తే మూడు వారాల్లోపు బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. చన్నీళ్లతో ఈతకొట్టడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెకు చక్కని వ్యాయామం అందుతుంది. కాలి, చేతి, కండరాలు దృఢంగా తయారవుతాయి. పైగా ఒత్తిడి అదుపులో ఉంటుంది. మెదడూ చురుగ్గా పనిచేస్తుంది.వెచ్చటి నీళ్లలో ఎదురీదుతూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మర్దన చేసినంత అనుభూతి కలిగి విశ్రాంతి లభిస్తుంది. అయితే వచ్చీరానీ ఈత అస్సలొద్దు. ఈత నేర్చుకున్నాకే నీటిలో దిగాలన్నది మర్చిపోకండి.

Categories
Health Tips

సబ్జా గింజలు వలన కలిగె ఉపయొగలు ఎమిటి ?

సబ్జా గింజలు వలన కలిగె ఉపయొగలు ఎమిటి ?

ఎండాకాలం వస్తే దాహం ఓ పట్టాన తీరదు. ఎన్ని తాగినా, ఏం చేసినా నోరు ఎండిపోతూనే ఉంటుంది. చల్లగా ఉన్నవి ఏవైనా మళ్లీ మళ్లీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటప్పుడు మన దాహం తీర్చేందుకు సరైనవి సబ్జా గింజలు. ఇవి దాదాపు అన్ని కిరాణా, సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. జస్ట్ ఓ చెంచాడు సబ్జా గింజల్ని ఓ గ్లాసు నీటిలో వేసి… ఓ పావు గంట అలా ఉంచితే చాలు… అవి చక్కగా ఉబ్బుతాయి. ఆ నీటిలో కాస్త పంచదార లేదా నిమ్మరసం వంటివి వేసుకొని తాగితే చాలు… దాహం తీరడమే కాదు… ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మలబద్దకాన్ని నివరిస్తుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది.


ఇంకా ఎన్నో ఆరోగ్య రహస్యాలు..
☀ తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
☀ వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
☀ గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
☀ గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు.
☀ సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.
☀ సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.

Categories
Health Tips

రోజంతా అలసిపొతున్నరా ?

రోజంతా అలసిపొతున్నరా ?

సరిగ్గా నీళ్లు తాగకపోవడం: మనుషులకు చాలా ముఖ్యమైన వాటిలో నీళ్లు ఒకటి. ఎప్పుడైతే మీరు డీహైడ్రేట్‌కి లోనవుతారో అప్పుడు అలసిపోయినట్టు ఫీలవుతారు. శరీరం డీహైడ్రేట్‌ అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ శరీరానికి సరైన మోతాదులో అందవు. దీనివల్ల అలసిపోతారు.

ఐరన్ తీసుకోకపోవడం: ఐరన్ లోపం వల్ల కేవలం నీరసం, అలసట మాత్రమే కాదు చిరాకుకి కారణమవుతుంది. శరీరంలో ఐరన్ తగ్గితే ఆక్సిజన్ కండరాలు, కణాలకు తక్కువగా అందుతుంది. అలాగే అనీమియాకి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ బీన్స్, ఎగ్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ తీసుకోవడం మంచిది.

బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం: మనందరికీ తెలుసు బ్రేక్ ఫాస్ట్ ఎంత అవసరమో. మెటబాలిజంను పెంచడానికి బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది. మంచి ఫ్యాట్, ప్రొటీన్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. 2 స్లైస్‌ల వోల్ వీట్ బ్రెడ్, ఒక గ్లాసు స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది.

వ్యాయామం: ఉదయం నిద్రలేవగానే జిమ్, వాకింగ్ ఏదో ఒకటి చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా ఫీలవుతారు. వర్కవుట్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి రోజంతా ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు.

ఎక్కువగా కష్టపడటం: వర్క్ గురించి ఎక్కువగా చింతించడం, ఒత్తిడికి లోనవడం, ఎక్కువ సమయం పనిచేయడానికి టైం స్పెండ్ చేయడం వల్ల మీరు అలసిపోతారు. ఒత్తిడి సైలెంట్ కిల్లర్ అని మరిచిపోకండి.

ఫోన్, ఈమెయిల్స్: మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్, ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా ? ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు ఎక్కువగా అలసిపోతున్నట్టు ఫీలవుతారు.

Categories
Health Tips

బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?

బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?

బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు ఇమునిటీని పెంచుతాయి. సంతాన లేమికి బఠాణీలు బేష్‌గా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇక కణాల్లోని డీఎన్ఏ తయారీకి ఫోలేట్లు అవసరం.అందుకే ఫోలేట్లు సమృద్ధిగా ఉండే బఠాణీలను తీసుకోవడం ద్వారా గర్భం ధరించడం సులువవుతుంది. ఇక గర్భిణీగా ఉన్నప్పుడు బఠాణీలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ సమస్యలు లేకుండా చేస్తాయి.

బఠాణీల్లో ఫైటోస్టెరాల్స్‌ ముఖ్యంగా బీటా సైటోస్టెరాల్‌ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్‌ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్‌ శాతమూ ఎక్కువే. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.

ఆల్జీమర్స్‌, ఆర్థ్రైటిస్‌ వంటి వ్యాధుల్ని అరికట్టేందుకూ ఇది తోడ్పడుతుంది. ఇక బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫేవనాయిడ్స్ జియాక్సాంథిన్, ల్యూటెన్, విటమిన్‌-ఎ వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.