‘చుట్టాలబ్బాయి’ ట్రైలర్

ఆది, నమిత ప్రమోద్‌, వీరభద్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి విడుదలైంది. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదలైంది. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికిఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్‌, […]

ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌’ టీజర్‌

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్‌’ టీజర్‌ బుధవారం సాయంత్రం విడుదలైంది. ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీయే.. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్‌, ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’  ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతున్నఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ చిత్రంలో […]

ప్రారంభమైన మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా షూటింగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కల నేటితో నెరవేరింది. గురువారం ఆయన నటిస్తున్న 150వ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తనయుడు రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమిళంలో విజయ్‌ నటించిన ‘కత్తి’ చిత్రం రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఠాగూర్‌’ చిత్రం ఘన విజయం సాధించింది. దేవీ శ్రీ ప్రసాద్‌ […]

చిరు చించేసాడు – స్పెషల్ డాన్స్ వీడియో

ఆదివారం రాత్రి చిరంజీవి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకూ అంటే ఆయన తన 150 వ చిత్రం ఎలా ఉండబోతోంది, కాన్సెప్ట్ ఏమిటి, సినిమాలో ఏయే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో చెప్తూ చిరంజీవి ఓ వీడియోని అందించారు. అలాగే ఆయన గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ కు శ్రీకాంత్, సునీల్ తో పాటు డాన్స్ చేసారు. ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది మాటీవీ సినీ మా అవార్డ్స్ క్రమంలో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయటం […]

స్వర్గం చూపిస్తానంటున్న రష్మీ అంతం – ట్రైలర్

స్వర్గం చూపిస్తానంటున్న రష్మీ అంతం – ట్రైలర్ గుంటూర్ టాకీస్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది రష్మీ గౌతమ్. తన హాట్ అందాలతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీ మరోసారి అందాల ప్రదర్శనకు సిద్ధమయ్యింది. రష్మీ నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో రష్మీ ఎప్పటిలాగే రెచ్చిపోవడంతో ప్రస్తుతం ఈ ట్రైలర్‌ను ఎగబడి చూస్తున్నారు అభిమానులు. Antham is a […]

జనతా గ్యారేజ్ లో విదిషా ?

జనతా గ్యారేజ్ లో విదిషా ? ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్య మీనన్ నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో  శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో  కనువిందు చేసిన విదిషా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కొరటాల శివ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంతున్నది మరో వర్గం. ఈ నెలలో ఆడియో విడుదల కార్యక్రమం, ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ర‌జ‌నీకాంత్ క‌బాలి తెలుగు రైట్స్‌ 32 కోట్లు

రిలీజ్‌కి ముందు రికార్డులు బ‌ద్దలు కొడుతోంది క‌బాలి.  ర‌జ‌నీకాంత్ మ‌రో సెన్సేష‌న్‌కి రెడీ అవుతున్నాడు. తెలుగులోనే ఈ సినిమాను 32 కోట్ల‌కు కొనుగోలు చేశారు ష‌ణ్ముఖ ఫిల్మ్స్ ప్ర‌వీణ్ చౌద‌రి. ష‌ణ్ముఖ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై తెలుగులో విడుద‌ల కానుంది ఈ మూవీ. క‌బాలి తెలుగు రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు దిల్‌రాజు, అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు ఎగ‌బ‌డ్డాయి. భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేశాయి. కానీ, అంత‌కుమించి అంటూ ప్ర‌వీణ్ చౌద‌రి క‌బాలి తెలుగు డిస్ట్రిబ్యూష‌న్‌ని ద‌క్కించుకున్నారు. ఈ సినిమాపై భారీ […]

మహేష్ బాబుతో పరిణితి చోప్రా ?

మహేష్ బాబు తదుపరి చిత్రం తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పరిణితి చోప్రా టాలీవుడ్ కి పరిచయంకానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 15నుంచి ఆరంభంకానుందని తెలుస్తోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ ఆరంభంకానుందట. మహేష్ బాబు, […]

ఎన్టీఆర్‌ను దాటేసిన సమంత..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నితిన్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అ ఆ’ మరో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ టాప్‌ వన్‌లో ఉండగా.. మహేశ్ ‘శ్రీమంతుడు’ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. టాప్‌ త్రీలో ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ ఉన్న చిత్రాన్ని నితిన్ ‘అ ఆ’ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాల […]