11న నారా రోహిత్‌ ‘తుంటరి’ విడుదల

నారా రోహిత్‌, లతా హెగ్డే జంటగా కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తుంటరి’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నారా రోహిత్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.  ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిల్మ్స్‌ పతాకంపై అశోక్‌, నాగార్జున్‌లు సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చారు. ‘మన్‌ కరాటే’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తుంటరి’గా తెరకెక్కించారు.

హాట్ గా ఎక్స్ ఫోజింగ్ చేసి షాకిచ్చిన కాజల్

Kajal Aggarwal hot show at Filmfare Awards 2016 సౌత్ సినిమాల్లో  స్టార్ హీరోయిన్ అయిన కాజల్  బాలీవుడ్లో మాత్రం అమ్మడు అనుకున్న స్థాయికి ఎదగలేక పోతోంది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలు సరిగా ఆడక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ లాంటి చోట గుర్తింపు ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఇందుకోసం హీరోయిన్ల మేగజైన్ల పై హాట్ హాట్ ఫోజులతో రెచ్చి పోతుంటారు. కాజల్ కూడా మరింత స్పెషల్ గా నిలవడానికి, […]

అంగ రంగ వైభోగంగా బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ ఆడియో విడుదల

  శ్రీవాస్‌ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా  నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు సమకూర్చిన  ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలో వైభవంగా జరిగింది. ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలి సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి చిత్ర కథానాయకుడు బాలకృష్ణకు అందించారు.

భారత మార్కెట్లోకి వీడియోకాన్‌ జడ్‌ 55

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారీ సంస్థ వీడియోకాన్‌, జడ్‌ 55 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర రూ. 7,999గా సంస్థ ప్రకటించింది.